Prabhas | రాజాసాబ్‌కు అన్యాయమా..?

Prabhas | రాజాసాబ్‌కు అన్యాయమా..?

Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందిన హర్రర్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతికి కానుకగా జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. రాజాసాబ్ కు థియేటర్స్ దొరికేనా అనే పరిస్థితి ఏర్పడింది. ఇదేంటి.. రాజాసాబ్ కు థియేటర్స్ దొరకకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే.. ఇది చదవాల్సిందే..

Prabhas | పాన్ ఇండియా సూపర్ స్టార్..

Prabhas

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆయనకు ఒక్క తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. ఒక్క పాన్ ఇండియాలో ఏంటి.. వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న స్టార్. ముఖ్యంగా పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా భారీగా క్రేజ్ ఉంది. ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, సలార్ తదితర చిత్రాలను ఆదరించారు. భారీగా కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. తాజాగా వస్తున్న రాజాసాబ్ మూవీకి కూడా తమిళనాడులో క్రేజ్ ఉంది. ఈ సినిమాను కూడా అక్కడ భారీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.

Prabhas | కోలీవుడ్ తీరు మారేదెప్పుడు..?

Prabhas

విషయం ఏంటంటే.. జనవరి 9న రాజాసాబ్ వస్తుంది. అదే రోజున.. తమిళ స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ వస్తుంది. ఆ సినిమా విజయ్ నటించిన ఆఖరి సినిమా కావడంతో అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకుల కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. తమిళ సినిమాలకు తెలుగులో కావాల్సినన్ని థియేటర్స్ ను మనవాళ్లు ఇస్తారు. కానీ.. తెలుగు సినిమాలకు తమిళ్ లో కావాల్సినన్ని థియేటర్స్ ఇవ్వరు. ఇది ఇప్పుడే కాదు.. గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈ సమస్య గురించి ఓ సందర్భంలో యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం తన ఆవేదనను బయటపెట్టాడు. తను నటించిన క అనే సినిమాను తమిళ్ రిలీజ్ చేయాలి అనుకుంటే.. థియేటర్స్ దొరకలేదు అంటూ తన బాధను మీడియా సాక్షిగా బయటపెట్టాడు. చాలా మంది.. చాలా సందర్భాల్లో ఆవేదనను వ్యక్తం చేసినా తమిళ ఇండస్ట్రీలో మార్పు రాలేదు.. కోలీవుడ్ తీరు మారలేదు.

Prabhas | విజయ్ కంటే..

Prabhas

విజయ్ మూవీకి మూడు రోజులు పాటు భారీగా స్క్రీన్లు, షోలు ఇస్తున్నారు. అయితే.. ప్రభాస్ సినిమాకు తమిళంలో మినిమం స్క్రీన్లు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. పాన్ ఇండియా స్థాయిలో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. విజయ్‌కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కంటే ప్రభాస్‌కు తమిళంలో ఉన్న క్రేజే ఎక్కువ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా సరే రాజాసాబ్ కు తమిళంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో స్క్రీన్లు దొరకడం కష్టంగా ఉంది. మన వాళ్లు మాత్రం విజయ్ సినిమాను ఎందుకు నెత్తిన పెట్టుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్ సినిమా అనే కాదు.. ఏ తమిళ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయాలన్నా.. కావాల్సినన్ని థియేటర్స్ ఇస్తారు మనవాళ్లు. మన సినిమాలకు తమిళ్ లో ఎందుకు థియేటర్స్ ఇవ్వరు. మరి.. రాజాసాబ్ విషయంలో తమిళ్ లో ఎన్ని థియేటర్స్ ఇస్తారో..? ఏం జరగనుందో..? చూడాలి.

CLICK HERE TO READ సందీప్ స్టైల్ లో దిల్ దియా పోస్టర్..

CLICK HERE TO READ MORE

Leave a Reply