Viral poster | సందీప్ స్టైల్ లో దిల్ దియా పోస్టర్..

Viral poster | సందీప్ స్టైల్ లో దిల్ దియా పోస్టర్..

Viral poster | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Viral poster | డిఫరెంట్ మూవీ..

డైరెక్టర్ కె. క్రాంతి మాధవ్‌కి దిల్ దియా .. ఏ నేక్డ్ ట్రూత్ ఆయన ఇప్పటి వరకు చేసిన భావోద్వేగాత్మక సినిమాల ప్రయాణానికి కొనసాగింపులానే ఉంటుంది. ఆయ‌న త‌న సినిమాల్లో ఎమోష‌న్స్‌లో డెప్త్‌తో పాటు బ‌ల‌మైన క‌థ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయ‌న తెర‌కెక్కించిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ప్రేమ, మ‌న‌సుల్లోని భావాలు, అంతర్గత సంఘర్షణలు పాత్ర‌ల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మ‌రోసారి క్రాంతి మాధ‌వ్‌ వైవిధ్య‌మైన మూవీ దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్ సినిమాలో నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు ప్రేమ‌, మోహం, వైఫ‌ల్యం, వ్య‌క్తులు లేదా మ‌న‌సుల మ‌ధ్య ఉండే సాన్నిహిత్యం, ఆత్మ గౌర‌వం వంటి ఎలిమెంట్స్‌ పై ఫోక‌స్ చేస్తూ ఎమోష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అవుతున్నారు.

Viral poster | షాకింగ్ పోస్టర్..

Viral poster

చైత‌న్య‌రావు మాదాడి, ఇరా, స‌ఖి, జెస్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ణి చంద‌న‌, ప్ర‌మోదిని, వీర శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సినిమా నేచుర‌ల్‌గా ఉండాల‌నే ఆలోచ‌న‌తో డైరెక్ట‌ర్ అండ్ టీమ్ న‌టీన‌టుల‌ను ఎంపికలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల సినిమాలో ఓవ‌ర్ డ్రామా లేకుండా నేచురాలిటీ క‌నిపిస్తుంది. ఎమోష‌న్స్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గ‌మ‌నిస్తే.. బ‌ట్ట‌లు లేకుండా సొఫాలో కూర్చున్న చైత‌న్య రావును చూడొచ్చు. త‌ను ర‌గ్డ్ లుక్‌తో స్క్రీన్‌ను సీరియ‌స్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వ‌స్తోంది. త‌న చూపుల్లోని ఇంటెన్సిటీ త‌న పాత్ర‌లోని సీరియ‌స్‌నెస్‌ను తెలియ‌జేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయ‌కుండా , పాత్ర‌లు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ క‌లుగుతుంది. ఈ సినిమా 2026 సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE TO READ అనౌన్స్ చేసిన బెల్లంకొండ..

CLICK HERE TO READ MORE

Leave a Reply