IPL | కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బీసీసీఐ ఆర్డర్

IPL | కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బీసీసీఐ ఆర్డర్
IPL | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులను పలువురు నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ (IPL) నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ముస్తాఫిజుర్ రెహమాను రిలీజ్ చేయాలని బీసీసీఐ తాజాగా కేకేఆర్‌కు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ రోజు ముస్తాఫిజుర్ ఎంపికపై బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్ (Bangladesh) ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి. ఇది తమ చేతుల్లో లేని వ్యవహారమని, దీనిపై ఇంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదని వెల్లడించాయి.
