Registration Officer | సంక్రాంతిలోపు వెరిఫికేషన్ 100శాతం పూర్తి చేయాలి

Registration Officer | సంక్రాంతిలోపు వెరిఫికేషన్ 100శాతం పూర్తి చేయాలి

  • నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు

Registration Officer | ఘంటసాల, ఆంధ్రప్రభ : సంక్రాంతిలోపు ఓటర్ వెరిఫికేషన్ 100శాతం పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పెనుమూడి సాయిబాబు తెలిపారు. ఇవాళ బీఎల్ఓల సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. 2002 ఓటర్లు లిస్ట్ కు 2025 ఓటర్లు లిస్ట్ కు ట్యాలి వెరిఫికేషన్ చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎంత‌మందికి ఇంకా వెరిఫికేషన్ చేయాలనేది ఘంటసాల మండల్ లోని 44 పోలింగ్ స్టేషన్ల బీఎల్ఓలను రివ్యూ చేశారు. అవేరేజ్ గా 65% చేశారని, సంక్రాంతి లోపు 100% చేయండి అని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారావు, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, మండలానికి చెందిన బీఎల్వోలు పాల్గొన్నారు.

Leave a Reply