Chityala | పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా
Chityala | పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా
- సర్పంచ్ ఆవుల సుందర్
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ తాము చదువుకున్న పాఠశాలను మండల విద్యాధికారి సైదా నాయక్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ… తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధిలో తమ వంతు సహకరిస్తామని తెలియజేశారు. గ్రామంలోని ఉన్న పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికైందని, వాటి ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామన్నారు.
విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలకు సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతమున్న భవనం సీలింకు తొందరలోనే రిపేర్లు చేయించి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ తాము చదువుకున్న పాఠశాలకు సర్పంచ్ గా తెలిసి వచ్చిన ఆవుల సుందర్ ను, ఉప సర్పంచ్, బెల్లంకొండ లావణ్య రఘును ఎంఈఓ సైదా నాయక్ తో పాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్ విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
