Water plant | తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు

Water plant | తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు

Water plant | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామంలోని బొత్తలగూడెంలో మాజీ సర్పంచ్ వేమిరెడ్డి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, అరవింద రెడ్డి వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు బొత్తలగూడెంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.

నూతన సంవత్సరం సందర్భంగా వాటర్ ప్లాంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామంలోని ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పరబోయిన నరసింహ, సర్పంచ్ బండమీది యాదయ్య, ఉపసర్పంచ్ మల్లేష్, కొంక శంకర్, కొంక రాజు, వార్డ్ సభ్యులు శ్రీకాంత్, మౌనిక, గాదపాక యాదయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply