incident | అచ్చంపేటలో హృదయ విదారక ఘటన..

incident | అచ్చంపేటలో హృదయ విదారక ఘటన..
… చెరువులో పసికందు మృతదేహం లభ్యం
incident | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో మానవత్నం మంట కలిసేలా హృదయ విదారక ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అచ్చంపేట పట్టణంలోని మల్లంకుంటలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమయింది. అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్(Saddam Hussein) తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నీటిలో తేలియాడుతున్న పసికందు మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఆయన చెప్పారు.
పసికందు మృతదేహాన్ని పరిశీలించగా బొడ్డుతాడు ఇంకా తొలగించలేదని, ఆడ శిశువుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అప్పుడే పుట్టిన పసికందు(baby) మృతదేహాన్ని అంతకు ముందు రాత్రి చెరువులో పడేయగా, శిశువు మృతదేహం డికంపోస్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచి పసికందును ఇలా మురికి కుంటలో పడవేసి దుర్ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
