celebrations | సంబరాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

celebrations | సంబరాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

  • ప్రత్యేక పోలీసు బృందాల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు
  • డీజే సౌండ్ సిస్టంలకు ఎలాంటి అనుమతి లేదు
  • టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ

celebrations | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : నూతన సంవత్సర సంబరాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని టేకులపల్లి మండల సీఐ బత్తుఓల సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

నూతన సంవత్సర వేడుకల నిబంధనలకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. మద్యం మత్తులో రోడ్లపై వేగంగా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టం, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలను ఆర్కెస్ట్రాల(Orchestras)ను సౌండ్ సిస్టంలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల నుంచి టేకులపల్లి పరిధిలోని మూడు సర్కిళ్లలో టేకులపల్లి,బోడు,ఆళ్లపల్లి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ప్రత్యేక పోలీస్ బృందాలతో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) టెస్టులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగటం నిషేధించడం జరిగిందన్నారు. మైనర్లు, యువకులు బైకు రైడింగులు చేసి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇచ్చేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి ఎస్ఐ రాజేందర్, బోడు మండల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఆళ్లపల్లి ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్ పాల్గొన్నారు.