Vehicles | విద్యార్థుల భద్రతే ముఖ్య ఉద్దేశం

Vehicles | విద్యార్థుల భద్రతే ముఖ్య ఉద్దేశం

  • నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వాహనాలు సీజ్

Vehicles | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రాంతంలో ఇటీవల విద్యార్థులు న‌డిపిస్తున్న‌ఆయా రకాల వాహనాలు(Vehicles) ప్రమాదాలకు గురికావడం జరిగింది. దీనిపై కామారెడ్డి జిల్లా రవాణాశాఖ అధికారి స్పందించారు.

జిల్లా రవాణా శాఖఅధికారి ఆదేశాల మేరకు రవాణాశాఖ ఎంవిఐలు మధుకర్, ఉదయ్ కుమార్, రఫీ జుక్కల్ ప్రాంతంలో ప్రధాన రహదారులపై మెరుపుగా పాఠశాల వాహనాలు, ఆటోలు, మినీ క్యాబ్ లను ఆకస్మిక తనిఖీలు(random checks) నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వాహనాలను సీజ్ చేశారు.

Vehicles |

ఆయా రకాల వాహనాలు విద్యార్థులకు సురక్షితంగా, భద్రంగా కళాశాలకు, పాఠశాలలకు చేర్చడమే కాకుండా, ప్రతి వాహనానికి సరైన ధృవపత్రాలు కలిగి ఉండి, రవాణా శాఖ నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని దీనిపై ఉపేక్షించేది లేదని వారన్నారు.

Vehicles |

Leave a Reply