Tournament | బీజేవైఎం ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

Tournament | బీజేవైఎం ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
Tournament | చెన్నూర్, ఆంధ్రప్రభ : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకృష్ణ ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్(Volleyball tournament) పోస్టర్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈ రోజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో వివేకానంద సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం(school playground)లో ఈనెల 12 నుంచి 14 తేదీ వరకు నిర్వహించడం హ ర్షనీయమని అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అన్ని పట్టణాల నుండి క్రీడాకారులు పాల్గొనవచ్చునని. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
