Ramulu | హోంగార్డు మృతి

Ramulu | హోంగార్డు మృతి
Ramulu | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ చెరుకుగూడెంకు చెందిన, హోంగార్డు మంత్రి రాములు(50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వద్ద మృతిచెందారు. పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న రాములు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. తన ఇంటి వద్ద మృతిచెందారు.
మృతునికి భార్య పద్మతో పాటు 9ఏండ్ల దత్తత తీసుకున్న కుమార్తె రశ్మిత ఉన్నారు. రాములు మృతదేహం వద్ద భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాములు విధి నిర్వహణలో అధికారుల ఆదేశాలను పాటిస్తూ, ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకున్నారు. రాములు మృతి పట్ల పోలీసులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
