వేగవంతంగా కొనసాగుతున్న జలధార – జలహారతి పనులు
10 కోట్ల రూపాయలతో పూడిక పనులు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జలవనులను అనుసంధానించడం ద్వారా భూగర్భ జలాలను పెంచడం, చెరువులు, నీటి కుంటలను అభివృద్ధి చేయడం ద్వారా, రైతులకు ఎంతో మేలు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార -జలహారతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉరవకొండ మండలంలో వివిధ గ్రామాలలో ఉపాధి హామీ నిధులతో, జలధార- జలహారతి కింద చెరువులు, నీటి కుంటలు, కాలువలో పూడిక పనులను చేపట్టారు. మండలంలో 22 గ్రామాలలో 153 పనులు చేపట్టడానికి 10 కోట్ల రూపాయలు మనిధులు మంజూరు చేశారు.
ఒక్క ఉరవకొండ ప్రాంతంలో 26 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 102 పనులను పూర్తి చేశామని ఎంపీడీవో రవి ప్రసాద్, ఏపీవో సుజాత తెలిపారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మిగిలిన 51 పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. పనులు చేపట్టడానికి గ్రామాల్లో ఉపాధి శ్రామికులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు.
