అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

జైపూర్, ఆంధ్రప్రభ : అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది.అందిన వివరాల మేరకు…జైపూర్ మండలం బెజ్జల గ్రామానికి చెందిన గుమ్ముల రాజం (56) అనే వ్యక్తి వృత్తి రీత్యా జాలరి.
తను బెజ్జల గోదావరి ఒడ్డున ఉండే గంగాదేవి ఆలయానికి వెళ్లి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించే వాడు.ఇదే క్రమంలో మంగళవారం ద్విచక్ర వాహనంపై సాయంత్రం ఆలయానికి వెళ్లిన తను ఇంటికి తిరిగి రాకపోవడం తన కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లి చూడగా
లేకపోవడంతో గోదావరి నది వద్ద వెతుకగా వాగులో మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. మంత్రాల నెపంతో ఈ ఘటన జరిగి ఉండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా రాజం మృతుదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది.
దీనితో సమాచారం అందుకున్న పోలీసులు బెజ్జల గ్రామానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి అనంతరం మృత దేహాన్ని శవ పరీక్షల నిమిత్తం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
