ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తే కఠిన చర్యలు..
రైల్వే అండర్‌పాస్‌ను వినియోగించాలని సూచన
పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఉత్తర్వులు, ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షేక్ షరీన్ బేగం ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఏసీపీ వేద పర్యవేక్షణలో సింగ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం. ప్రభాకర్, ఎస్సై జె. కృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది బుడమేరు జంక్షన్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్లాట్‌ఫారం బండ్లకు మోటార్లు అమర్చి సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న బండి యజమానులను గుర్తించి, వెంటనే మోటార్లను తొలగించాలని సూచించారు. మోటార్ అమర్చిన ఫ్లాట్‌ఫారం బండ్లతో ఫ్లైఓవర్‌పై ప్రయాణించడం చట్టవిరుద్ధమని, దీనివల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు.
అలాగే ఫ్లైఓవర్‌ను వినియోగించకుండా రైల్వే అండర్‌పాస్ మార్గం ద్వారానే రాకపోకలు సాగించాలని అవగాహన కల్పించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఫ్లైఓవర్‌పై మోటార్ అమర్చిన ఫ్లాట్‌ఫారం బండ్లతో ప్రయాణించినట్లయితే మోటారు వాహన చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
