Forum President | బీఆర్ఎస్‌ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా ఫిరోజ్

Forum President | బచ్చన్నపేట, ఆంధ్ర‌ప్ర‌భ : బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ ఫిరోజ్ బచ్చన్నపేట మండలం బీఆర్ఎస్‌ సర్పంచుల పోరం అధ్యక్షుడిగా సర్పంచ్ ఎండీ ఫిరోజ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యార‌ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌ మాట్లాడుతూ త‌న‌పై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, రానున్న ఎన్నికలలో ఇదే బీఆర్ఎస్ జోష్ ను కొనసాగిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ లింగంపల్లి సర్పంచ్ మద్దికుంట రాధారెడ్డి, ఇర్రి రమణారెడ్డి, బొడిగం చంద్రారెడ్డి, గంగం సతీష్ రెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, ముసిని రాజు, కోనేటి స్వామి, పరిదే మల్లేష్, లక్ష్మణ్ గౌడ్, అజీమ్, జూకంటి కిష్టయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply