Varni | ఉపాధి పథకం నిర్వీర్యానికి కుట్ర

Varni | ఉపాధి పథకం నిర్వీర్యానికి కుట్ర
- గాంధీ పేరును తొలగించడంపై నిరసన
Varni | వర్ని, ఆంధ్రప్రభ : ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్నినిరసిస్తూ ఈ రోజు వర్ని మండల కేంద్రం లో కాంగ్రస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఆందోళన చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో గాంధీ పేరు తొలగించారన్నారు. గ్రామీణ కూలీలకు ఉపాధి కలిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిన పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, వెలగపూడి గోపాల్, మహ్మద్ భారీ సర్పంచ్ లు కనకదుర్గరవి, పెద్ద సాయిలు, ఆనంద్, లక్ష్మణ్, హరి సింగ్, అంబర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
