Operation Aghat 3.0 : అల్లరి మూకలకు కళ్లెం AndhraPrabha Real News

Operation Aghat 3.0 : అల్లరి మూకలకు కళ్లెం AndhraPrabha Real News
24 గంటల్లో.. 850 మంది అరెస్టు
పాతనేరగాళ్లకు కళ్లెం
ఆయుధాలు స్వాధీనం
బైకు దొంగలకు బ్రేక్
మందుబాబులకు షాక్
పేకాటరాయుళ్ల నట్టివేత
ప్రశాంత న్యూఇయర్ వేడుకలే లక్ష్యం
ఢిల్లీ జాయింట్ కమిషనర్ జైన్ వెల్లడి
( న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ )

నూతన సంవత్సర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు సర్వసన్నద్ధం అవుతున్న తరుణంలో.. అల్లరి గ్యాంగులను కట్టడి చేసే క్రతువులో ఢిల్లీ పోలీసులు నిమగ్నం అయ్యారు. ఆపరేషన్ ఆఘాట్ 3.0 సంధించారు. గడచిన 24 గంటల్లో దక్షిణ, ఆగ్నేయ ఢిల్లీ (South East Delhi) జిల్లాల్లో 660 మందిని పొలీసులు అరెస్టు (Arrested) చేశారు. ఆపరేషన్ ఆఘాట్ 3.0 (Operation Aghat 3.0) కింద ముందస్తు చర్యలో డజన్ల కొద్దీ ఆయుధాలు, లక్షలాది నగదు, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు , చోరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Operation Aghat 3.0

పండుగ వేళ.. నేరాలను నిరోధించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి. అనుమానిత అల్లరి మూకలను అదుపులోకి తీసుకోవడానికి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో దుర్బల ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దక్షిణ, ఆగ్నేయ జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఆగ్నేయ జిల్లాలోనే 285 మందిని అరెస్టు చేశారు. ఆయుధాల చట్టం, ఎక్సైజ్ చట్టం, NDPS చట్టం, జూదం చట్టం తదితర చట్టాల కింద ఈ అరెస్టులు జరిగాయి. ఈ డ్రైవ్లో 2,800 మందిని ప్రశ్నించినట్లు ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ (సెక్యూరిటీ) SK జైన్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా.. నేర రహితంగా జరిగేలా.. ఈ రెండు జిల్లాల్లో 850 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Operation Aghat 3.0 : పాతనేరగాళ్ల పట్టివేత

ఆప్ ఆఘాట్ 3.0 కింద, దాదాపు 155 మంది పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రైవ్ సమయంలో 10 మంది ఆస్తి నేరస్థులను కూడా అరెస్టు చేశారు.పోలీసులు 66 కేసులు నమోదు చేశారు. ఆయుధ చట్టం కింద 66 మందిని అరెస్టు చేశారు. 24 దేశీయ పిస్టల్స్ , 44 కత్తుల్పి స్వాధీనం చేసుకున్నారు.
Operation Aghat 3.0 : మందుబాబులకు షాక్
22,500 కు పైగా అక్రమ మద్యం సీపాలు స్వాధీనం చేసుకున్నారు, 60 మందికి పైగా అరెస్టు చేశారు. దాడుల సమయంలో 10 కిలోల గంజాయిని దొరికింది. మరో 10 మందిని అరెస్టు చేశారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవింస్తున్న 350 మందిని అరెస్టు చేశారు.
Operation Aghat 3.0 ఫ బైక్ దొంగలకు కళ్లెం

వాహన చోరీల నెట్వర్క్లను నిర్వీర్యం చేయడంపై కూడా ఈ డ్రైవ్ దృష్టి సారించింది. పండుగ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 5 గురు ఆటో-లిఫ్టర్లను అరెస్టు చేశారు. దాడుల సమయంలో 231 బైకులు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
Operation Aghat 3.0 :
పేకాటరాయుళ్ల పట్టివేత జూదం నిరోధక చట్టాల కింద కనీసం 30 కేసులు నమోదు చేశారు. రెండు జిల్లాల్లో 68 మంది జూదగాళ్లను అరెస్టు చేశారు. ₹. 2.3 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 350 చోరీ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎనీ హౌ.. ఢిల్లీలో ఆపరేషన్ ఆఘాట్ 3.0 అయింది.
ALSO READ : Robbery | రెండు నిమిషాల్లోనే…
