tollplaza | ఐదుగురు పోలీసుల దుర్మరణం

tollplaza | ఐదుగురు పోలీసుల దుర్మరణం

tollplaza | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఇవాళ తౌరు సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దులావత్ టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

యూపీలోని జలౌన్ జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్న ఈ పోలీసులు మహేంద్ర స్కార్పియో వాహనంలో పల్వాల్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.