Student | రాష్ట్రస్థాయికి ఎంపికైన భూస్రా

Student | రాష్ట్రస్థాయికి ఎంపికైన భూస్రా

Student | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి భూస్రా రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైందని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిభ కనబరిచిన సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన భూస్రా రాష్ట్ర స్థాయికి ఎంపికైందని, మెదక్ జిల్లా మనోహరాబాద్ లో జరగనున్న పోటీల్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం భూస్రాను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply