Payakapuram | సెమీ క్రిస్మస్ వేడుకలు..

Payakapuram | సెమీ క్రిస్మస్ వేడుకలు..
Payakapuram, ఆంధ్ర ప్రభ : క్రైస్తవులు ప్రజాహితం కోరేవారని ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ జోసెప్ మంగలపూడి పాల్గొని ప్రసంగించారు. బైబిల్లోని పలు అంశాల పై ఆయన క్రైస్తవ సహోదరులకు తెలియపరిచారు. సంఘస్తులు పాడిన పాటలు అందరిని అలరించాయి.
