Shivaji | మహిళలకు క్షమాపణ చెప్పిన మంగపతి
Shivaji | మహిళలకు క్షమాపణ చెప్పిన మంగపతి
శివాజీ ప్రముఖ నటుడు… ఇటీవల విడుదలైన కోర్టు సినిమాలో మంగపతి గా తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ఎలిమేనేట్ వారిని ఇంటర్వూ చేసి, బిబ్ బాస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. నిన్న హైదరాబాద్ లో ధండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మహిళల పై పలు వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. దీంతో మహిళా కమిషన్ స్పందించి.. చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో మంగపతి మహిళలకు క్షమాపణలు చెప్పారు.
శివాజీ ఎంమన్నారంటే..
స్త్రీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టలోనే ఉంటుందని అన్నారు. అసభ్యకరంగా బట్టలు వేసుకుంటే.. అందులో విలువేముంటుందని? హీరోయిన్లు పొట్టిబట్టలు వేసుకున్నప్పుడు బయటకు అందరూ పొగిడినా లోప అసహ్యించుకుంటారని అన్నారు. గ్లామర్ అనేది హద్దుల్లోనే ఉండాలని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. హీరోయిన్లు చీరలు కట్టుకోకపోతే వారి సామాన్లు కనిపిస్తాయని చెప్పడంతో హాట్ టాపిక్‌గా మారింది.
