Crime | ఇరు వర్గాల కొట్లాట.. కేసులు నమోదు…

Crime | ఇరు వర్గాల కొట్లాట.. కేసులు నమోదు…

  • ఒకరి చెయ్యికి గాయం..

Crime | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హాస్టల్ తాండకు చెందిన బాదావత్ శ్రీనివాస్ నాయక్, అతని కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన ఏజీపీ బానావత్ సంతోష్, సర్పంచి జయశ్రీ, అంబాజీ, సుధాకర్, తిరుపతి, బీమా, అఖిల్, అంబాలిబాయి ఇంటిపై దాడి చేసి కర్రలతో శ్రీనివాస్ ను పిల్లలను, కుటుంబ సభ్యులను కొట్టారని స్థానిక ఎస్సై(Local Scy) గొల్లపల్లి అనూష ఈ రోజు సాయంత్రం తెలిపారు.

ఈ కొట్లాటలో శ్రీనివాస్ చెయ్యికి గాయమైనట్లు, అతని పిర్యాదు మేరకు సంతోష్ తోపాటు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. బానావత్ సంతోష్ ఇంటిపై అదే గ్రామానికి చెందిన బాదావత్ శ్రీనివాస్, రామారావు,లాకావత్ ధర్మేష్, శంకర్ లు దాడి చేసి కొట్టారని సంతోష్ ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు(registers case) చేసినట్లు ఆమె చెప్పారు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఆమె వివరించారు.

దాడిచేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

తనపై పిల్లల,కుటుంబ సభ్యులపై ఇంటిమీదికి వచ్చి కర్రలతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టిన ఏజీపీ బి.సంతోష్, సర్పంచి జయశ్రీ, అంబాజి, సుధాకర్, తిరుపతి, బీమా, అఖిల్, అంబాలిబాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలంలోని హాస్టల్ తాండకు చెందిన బాధితుడు బాదావత్ శ్రీనివాస్ నాయక్(Badavat Srinivas Nayak) అన్నారు.

మంగళవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సర్పంచి ఎన్నికల్లో తనకు ఓట్లు వేయించలేదని, కవ్వాలలో సర్పంచి అభ్యర్థి శేషరావు ఓటమికి కారణమని కక్షతో దాడి చేశారన్నారు. ఈ దాడిలో తన చిన్న పిల్లలను విపరీతంగా కర్రలతో కొట్టి, తనను కూడ కొట్టగా తన చెయ్యికి బలమైన గాయమైనట్లు ఆయన చెప్పారు. ఆ 8మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.

Leave a Reply