Makthal | మహాద్వార్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Makthal | మహాద్వార్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
- సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మహద్వార్ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ నూతన సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మహాద్వార్ గ్రామ సర్పంచ్ గా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ గా కథనోళ్ళ శివాని 10మంది వార్డు సభ్యులు చేత ఇవాళ స్పెషల్ ఆఫీసర్ నాగశివ, పంచాయతీ కార్యదర్శి రాజేష్ శప్రమాణ స్వీకారం చేయించారు.
ఈసందర్భంగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… మహద్వార్ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. గ్రామంలో ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కారం కృషి చేస్తానన్నారు. అదేవిధంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాల్సిందిగా గ్రామస్తులకు విన్నవించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తనతో కలిసి రావాల్సిందిగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

అందరం కలిసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అందరి సలహాలు, సూచనలతో గ్రామాభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ శ్రీనివాసరెడ్డిని మక్తల్ మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంతోష రెడ్డి, నాయకులు పూజరి బాలప్ప, వడ్ల శ్రీనివాస్ చారి, వడ్ల రాములు, రామకృష్ణ, బీజేపీ, నాయకులు కె. సోమశేఖర్ గౌడ్, కురువ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
