ఇందిరమ్మఇండ్లనిర్మాణం సకాలంలోప్రారంభించండి.

ఇందిరమ్మఇండ్లనిర్మాణం సకాలంలోప్రారంభించండి.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇండ్లు లేని పేద ప్రజలకు ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో ప్రారంభించాలని ఊట్కూర్ ఎంపీడీవో కొండన్న, గృహ నిర్మాణ శాఖ ఏఈ ప్రేమ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డిఅన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 100 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామనిఅన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణం చేపట్టుకోవాలని దశలవారీగా బిల్లులు చెల్లిస్తామనిఅన్నారు.

వేసవికాలంలోనే ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే సకాలంలో బిల్లులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారనిఅన్నారు. రెండో విడతఇందిరమ్మఇండ్లు అమిన్ పూర్ కు 19, బిజ్వార్ కు 15, చిన్న పోర్లకు 20, ఎడవెల్లికి 17, త్రిప్రాసు పల్లికి 10, మల్లేపల్లి కి 5 ఇండ్లు, పగిడిమర్రి కి 14 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందిరమ్మ కలలు నెరవేర్చడంతోపాటు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందనిఅన్నారు. లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ, ఆయా పంచాయతీ కార్యదర్శుల సలహాలు సూచనల మేరకు ఇల్లు నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు, కొల్లంపల్లి అంజయ్య, టప్ప నాగేష్, జాఫర్, అంజయ్య, విజయలక్ష్మి నరసింహ, గాండ్ల నిఖీతప్రశాంత్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, నాయకులు గోవిందప్ప, విజయసింహారెడ్డి, పగిడిమర్రిఘని,గోపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply