
BJP Leaders | గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి
BJP Leaders | గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి
- బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి
BJP Leaders | కోట, ఆంధ్రప్రభ : గూడూరు ప్రజలు అయోమయంలో ఉన్నారని, గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పేర్నాటి ఆనంద రెడ్డి, పనబాక కోటేశ్వర రావు అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కటారి జయ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన, చిన్న జిల్లాలు ఏర్పాటుపై బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులో మహిళల సాక్షిగా మేము అధికారంలోకి వస్తే గూడూరును యథావిధిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు. ఇచ్చినమాటకు కట్టుబడి గూడూరు ప్రజలకు న్యాయంచేసి, సమస్యను సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, పనబాక కోటేశ్వరరావు, పాదర్తి కోటారెడ్డి, డా సారంగం రమేష్ బాబు, సత్తెన అంబరీష్, పులి సురేష్, చేవూరు శ్రీనివాసులు, పోసిన వెంకయ్య గౌడ్, కర్లపూడి రాంబాబు, లింగం గుంట వెంకటేశ్వర్లు, మహిళ నాయకురాలు మస్తానమ్మ, మంగమ్మ పాల్గొన్నారు.
