Temple | ధనుర్మాస మహోత్సవాలు..

Temple | ధనుర్మాస మహోత్సవాలు..

Temple | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం జగన్నాధపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) వారి దేవస్థానంలో వార్షిక ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులు చలసాని అమృతవల్లి ఉత్సవ మూర్తుల అలంకారం నిమిత్తం.. 138 గ్రాముల మూడు స్వర్ణ కిరీటాలను స్వామి వారికి సమర్పించారు. దేవస్థాన(Temple) మండపంలో సోమవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో ఈవో కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ లింగం శివరామ ప్రసాద్ కు స్వర్ణ కిరీటాలను భక్తులు అందజేశారు.

జనవరి 14వ తేదీ వరకు దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతాయని, 30వ తేదీన(30th) ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈఓ గోపాలరావు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయన్నారు. స్వామి వారికి ఇటీవల భక్తులు ముత్యాల అంగీ(pearl robe) సమర్పించారని, ఇప్పుడు స్వర్ణ కిరీటాలను అందించారని, ఉత్సవ వేడుకల్లో స్వామి వారికి వాటిని అలంకరిస్తామని ఈవో గోపాలరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు నిమ్మగడ్డ కృష్ణా రావు, చందుశ్రీనివాసరావు, P. రాజేశ్వరరావు, వేదాంతం కృష్ణ వేణి, కొడాలి విజయలక్ష్మి, గూడపాటి సుజాత, పంతంగి హేమ, జోగి సాంబశివరావు, ఆండాల్ గోష్టి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply