High school | ఘనంగా మెగా సెమీ క్రిస్మస్

High school | ఘనంగా మెగా సెమీ క్రిస్మస్
High school | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్(High school)లో మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల యేసు జన్మించిన పశువుల పాక అలంకరణ వీక్షకులను ఆకట్టుకుంది. ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే పలు నాటికలు విద్యార్థులు చేత ప్రదర్శించి ఏసుక్రీస్తు శాంతి సందేశం సారాంశాన్ని తెలియపరిచారు. చిన్నారులు దేవదూతల వేషధారణలో ఆకట్టుకున్నారు. పశువుల కాపరులు, ఏసుక్రీస్తు(Jesus Christ), మరియా మాత, ఆనాటి యూదుల, రాజుల వేషధారణలు చూపర్లను ఆకర్షించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫాదర్ సుధాకర్ హాజరయ్యారు. స్కూల్ కరస్పాండెంట్ మోలీ థామస్, ప్రిన్సిపాల్ లూర్తు మేరీ, వైస్ ప్రిన్సిపాల్(Principal) మౌని మార్ట్యూ, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.
