Narsampeta | నర్సంపేటలో అలుగు ప్రత్యక్షం

Narsampeta | నర్సంపేటలో అలుగు ప్రత్యక్షం
- ఫొటోలు, వీడియోలు తీసిన స్థానికులు
Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : లక్షల విలువ చేసే అలుగు నర్సంపేట పట్టణంలో సోమవారం తెల్లవారు జామున ప్రత్యక్షమైంది. నాగమయ్య గుడి వద్ద డివైడర్ వెంబడి వెళ్తూ మున్సిపాలిటీలోని రెండవ గేటు లోనికి వెళ్లిపోయింది. ఆ ప్రాంతమంతా నీరు మురికి చెట్లతో నిండి ఉండడం వల్ల దానిని ఎవరు కూడా పట్టుకోవడానికి సాహసించలేదు. ఈ అలుగు విదేశాల నుండి తరలించబడుతున్న సమయంలో కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దట్టమైన అడవిలో ఉండే ఈ అలుగు జనారణ్యంలో కనిపించే సరికి ప్రతి ఒక్కరు దానిని వెంబడిస్తూ వీడియోలు ఫోటోలు తీశారు.
ఈ అలుగు చిప్పలు కూడా ఎంతో విలువ కలిగినవని, మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారని పలువురు వ్యాఖ్యానించారు. ఈ అలుగు చిప్పలతో క్షుద్ర పూజల కూడా చేస్తారని అంటున్నారు. చీమలను ఇతర చిన్న కీటకాలను ఆహారంగా తీసుకునే అలుగు 5 కిలోల బరువు ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నర్సంపేట పట్టణంలో అలుగు ప్రత్యక్షం కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
