Gollapalli | కొలువుదీరిన కొత్త సర్పంచులు

Gollapalli | కొలువుదీరిన కొత్త సర్పంచులు
Gollapalli | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు పాలకవర్గ సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు కొలువుదీరారు. సంబంధిత కార్యదర్శులు, అధికారులు కొత్త పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చాలా గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా యువకులు గెలుపొందారు.
