TEST | గణితమే జీవిత గమనం

TEST | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో చాలామందికి గణితం అంటే ఒక భయం ఉంటుందని, దానిని అధిగమిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని మండల విద్యాశాఖ అధికారి ఎన్.ఆంధ్రయ్య అన్నారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకుని కమ్మర్ పల్లి ఎమ్మార్సీలో మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్షను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణితం గొప్పతనాన్ని వివరించారు. గణిత సబ్జెక్టులో పూర్తిస్థాయి పట్టు సాధిస్తే అన్ని అంశాలను ముందంజలో ఉండవచ్చని స్పష్టం చేసారు.
పదవ తరగతి పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా ముందడుగు వేయాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ గణితపురం రాష్ట్ర సలహాదారులు కోనాపూర్ ప్రధానోపాధ్యాయులు చౌడారాపు రాంప్రసాద్ విద్యార్థులందరికీ గణిత ఫార్ములాలు అందజేశారు. మండల స్థాయిలో ఆంగ్ల మాద్యమంలో పిఎం ఎస్ హెచ్ ఆర్ ఐ ( జడ్ పి హెచ్ ఎస్ ) చౌట్ పల్లి విద్యార్థులు ఎస్ ప్రణవి, సిహెచ్ మధుప్రియ, బి ప్రణవి, వై సోమిత్ లు వరుసగా మూడు స్థానాలు సాధించి జిల్లాకు ఎంపికయ్యారు.
తెలుగు మాధ్యమంలో కే లికిత, ఏం రచిత కే గంగాదేవిలు వరుసగా మూడు స్థానాలు సాధించి జిల్లాకు ఎంపికయ్యారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
