Leopard | గ్రామ శివారులో చిరుత సంచారం..

తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : గ్రామాల్లో చిరుత సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఎర్ర పహాడ్ గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికీ దూడలను ఆవులను చంపేసినట్టుగా ఆనావాళ్లు కూడా లభించాయి. పంట పొలాలకు, పశువుల మేపడానికి వెళ్లాలంటే భయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకొని పశువులను, ప్రజలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు అటవీ శాఖ చిరుత పట్ల ఎటువంటి అవగాహన కార్యక్రమం (Awareness Program) ఏర్పాటు చేయలేదు. ఈ కారణంగా గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
