Janasena leaders | వృద్ధ మహిళకు సాయం

Janasena leaders | వృద్ధ మహిళకు సాయం

  • వృద్ధాశ్రమానికి త‌ర‌లించిన జనసేన నాయకులు
  • దుప్పట్లు, చీరలు, పండ్లు అందజేత‌

Janasena leaders | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి బస్టాండ్‌లో గత రెండు రోజుల క్రితం ఓ వృద్ధ మహిళను ఎవరో గుర్తు తెలియని వాళ్ళు విడిచి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రూకేష్‌కి బంటుమిల్లి ఎస్సై తెలియజేశారు. వెంటనే స్పందించిన జనసేన నాయకులు ఆ వృద్ధ మహిళకు దుప్పట్లు, చీరలు, పండ్లు అందజేసి ఆ మహిళను ఎస్సై సహకారంతో విజయవాడలోని వృద్ధాశ్రమానికి పంపించారు. బంటుమిల్లి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గోట్రు రవికిరణ్, జనసేన నాయకులు బంటుమిల్లి మండల ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, జనసేన నాయకులు రూకేష్, మోచర్ల శర్మ, పయ్యావుల నాగాంజనేయులు, సన్నాల భాను పాల్గొన్నారు.

Leave a Reply