Governor | సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

Governor | సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
- అభినందన సభలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
Governor | మక్తల్, ఆంధ్రప్రభ : నూతనంగా ఎంపికైన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) అన్నారు. నూతనంగా గ్రామపంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపికైన మక్తల్, మాగనూరు, కృష్ణ, ఊట్కూర్, నర్వ మండలాల సర్పంచ్ల అభినందన సభను ఇవాళ మక్తల్ పట్టణంలోని ద్వారకా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఈసందర్భంగా కొత్తగా ఎంపికైన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డితో కలిసి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల కోసం ఉపయోగించే ప్రతి పైసా పై సంతకం చేసే అధికారం గవర్నర్(Governor) సర్పంచ్లకు మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.
అంతటి బాధ్యత కలిగిన సర్పంచులు తమ పదవి కాలంలో బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి సర్పంచ్ పై ఉందన్నారు.

