Telangana | సర్పంచ్, వార్డు సభ్యులకు స‌న్మానం

Telangana | సర్పంచ్, వార్డు సభ్యులకు స‌న్మానం

  • సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు…

Telangana | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండలంలోని స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్, వార్డు మెంబర్లు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(MLA Thanniru Harish Rao), మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డిలను ఇవాళ‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎన్నికల్లో(elections) గెలుపు, ఓటములు చెందిన వారిని హరీష్ రావు శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలుపు ఓటమిలో సహజమని, ఓడిపోయిన వారు బాధ పడొద్దని వారికి భరోసా ఇచ్చారు. నేటి ఓటమి రేపు గెలుపున‌కు నాంది అవుతుందన్నారు.

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మద్దతుగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తో పాటు నిజాంపేట మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply