
Revenue | రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు
Revenue | రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు
- లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్ఐ
- కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Revenue | కారేపల్లి, ఆంధ్రప్రభ : కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్(Revenue Inspector) (ఆర్ ఐ)గా విధులు నిర్వహిస్తున్న దౌలూరి శుభకామేశ్వరి దేవీ ఏసీబీ వలలో చిక్కింది. ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం బాధితుని వద్ద పది వేలు లంచం డిమాండ్ చేసింది. బాధితుడు ఏసీబీని సంప్రదించాడు.
గురువారం మండల కేంద్రంలోని తన నివాసం వద్ద బాధితుని వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటున్న ఆర్ఐను డీఎస్పీ వై.రమేష్ తన సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్(Red-Handed)గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పి రమేష్ మాట్లాడుతూ.. అధికారులెవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్1064 కు ఫోన్ చేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన, బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
