Amrit Bharat | రక్షణతో కూడిన పనితోనే రైల్వే అభివృద్ధి
Amrit Bharat | రక్షణతో కూడిన పనితోనే రైల్వే అభివృద్ధి
- అధికారులు, సిబ్బంది రక్షణ సూత్రాలు పాటించాలి
- డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణన్
Amrit Bharat | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది రక్షణను తమ బాధ్యతగా భావించి విధులు నిర్వహించినప్పుడే రైల్వే శాఖ అభివృద్ధి సాధ్యమవుతుందని సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్(Railway station) క్రూ లాబీలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, లోకో పైలట్లతో నిర్వహించిన సేఫ్టీ సెమినార్(safety seminar)లో డీఆర్‌ఎం పాల్గొని మాట్లాడారు.
వ్యక్తిగత రక్షణ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాల్సిన అంశమని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలను నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో నిర్మాణంలో ఉన్న స్టోర్ రూములు, రైల్వే క్వార్టర్లు తదితర అభివృద్ధి పనులను డీఆర్‌ఎం పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

అనంతరం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్(Amrit Bharat) పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎం షఫాలి, నార్త్ ఎస్‌ఆర్‌డీఎం అభిరామ్, బెల్లంపల్లి అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ ఏ.గోపి సహా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
