counting | పాటిమట్ల పోలింగ్ కేంద్రం పరిశీలన

counting | పాటిమట్ల పోలింగ్ కేంద్రం పరిశీలన
- పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్ గౌతమి
counting | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో 3వ విడత ఎన్నికల్లో భాగంగా పాటిమట్ల మోడల్ పోలింగ్ కేంద్రాన్ని(Polling station) బుధవారం రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి గౌతమి (ఐఏఎస్) క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా భువనగిరి ఆర్ డి ఓ కృష్ణారెడ్డి గ్రీన్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన అబ్జర్వర్ గౌతమికి మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

ఈసందర్భంగా పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని స్వయంగా ఆమే పర్యవేక్షణ చేశారు. పోలింగ్ తో పాటు కౌంటింగ్(counting) సైతం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మండలంలో ఇప్పటివరకు 56శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె వెంట ఆర్ డి ఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జ్యోతి ఉన్నారు.
