244 wards |నేటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి…

244 wards |నేటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి…

244 wards | భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ రోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్(Distribution) రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు.

మండలంలో 27 గ్రామ పంచాయతీలకు గాను నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 23 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానం కొరకు 98 మంది పోటీలో ఉండగా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 244 వార్డులకు(244 wards) గాను 72 వార్డులు ఏకగ్రీవం కాగా 172 వార్డులకు 447 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది.

23 గ్రామపంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ ఎన్నికల నిర్వహణ కొరకు మొత్తం సుమారు 600 మంది సిబ్బంది(600 staff) ని నియమించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు సత్యనారాయణ గౌడ్, అంజయ్య నేత్రుత్వంలో పదిమంది ఎస్సై లు, 129 మండి పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో డ్యూటీ నిర్వహించనున్నారు.

పోలింగ్ కు కావలసిన సామగ్రిని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఆయా గ్రామ పంచాయతీలలోని పోలింగ్ బూతులకు కేటాయించిన సిబ్బందికి పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది(polling staff ) ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మండలంలో ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ పర్యవేక్షించారు.

Leave a Reply