POWER STAR | సరికొత్త రికార్డ్ సెట్ చేసిన దేఖ్ లేంగే సాలా..

POWER STAR | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గబ్బర్ సింగ్.. సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీ పవర్ స్టార్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు(For general audience) కూడా విపరీతంగా నచ్చేసింది. అందుకనే.. ఈ క్రేజీ కాంబోలో మరో మూవీ వస్తే.. చూడాలి అనుకుంటున్న జనాల కోసం అన్నట్టుగా పవర్ స్టార్, హరీష్ శంకర్.. కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) మూవీ రూపొందుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా దేఖ్‌లేంగే సాలా విడుదలై శ్రోతలను విశేషంగా ఉర్రుతలూగిస్తోంది. ఇటీవల రిలీజైన ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళుతుంది.

POWER STAR | 24 గంటల్లో 29.6 వ్యూస్..

POWER STAR

ఈ సాంగ్ కు గీత రచయిత భాస్కరభట్ల సంగీతం అందించారు. ఈ పాట రిలీజైన కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర(New history) సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి, సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్(Dinesh master) సమకూర్చిన స్టెప్పులు అయితే.. చాన్నాళ్ల తర్వాత పవర్ స్టార్ ను అలా డ్యాన్స్ చేయడం చూసామంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

POWER STAR | హరీష్ శంకర్ విందు..

POWER STAR

దేఖ్‌లేంగే సాలా.. పాట ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంగీతం విషయంలో ఆయనకు మంచి అభిరుచి ఉంది. హరీష్ శంకర్(Harish Shankar) గత చిత్రాలలోని పాటలు వింటే ఆ విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటలు ఎంతటి ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఆ తరహా పాటలలో, ఆ తరహా డ్యాన్స్ తో.. చూడాలని కోరుకునే అభిమానులు(fans) ఎందరో ఉన్నారు. వారి కోరికను నెరవేర్చడానికి దేఖ్‌లేంగే సాలా పాటకు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్. ఆయన కృషి ఫలితంగానే ఈ పాట అభిమానులకు విందు భోజనంలా మారి, ఇంతటి ఆదరణ పొందుతోంది.

POWER STAR | మరో గబ్బర్ సింగ్..

POWER STAR

గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ చేసిన ఎంటర్ టైన్మెంట్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. అయితే.. పవన్, హరీష్ శంకర్.. కలిసి సినిమా చేస్తున్నారంటే.. జనాలు గబ్బర్ సింగ్ తరహాలో ఉండే ఎంటర్ టైన్మెంట్(Entertainment) ఆశిస్తారు. అందుకనే.. ఈ సినిమాకి వచ్చే జనాలు నిరుత్సాహపడకుండా.. ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేసేలా.. ఈ కథను రెడీ చేశారట హరీష్ శంకర్. పవర్ స్టార్ అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎన్ని అంచనాలతో వచ్చినా.. అదిరింది అనేలా.. ఆడియన్స్ ఫీలయ్యేలా(To make the audience feel).. ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సమ్మర్ లో.. ఉస్తాద్ భగత్ సింగ్ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రానుంది. మరి.. ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

CLICK HERE TO READ అబ్బా కొడుకులే

CLICK HERE TO READ MORE

Leave a Reply