TG | ప్రచారంలో దూసుకెళుతున్న వేణు..
TG, తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి 3వ వార్డ్‌లో వార్డ్ మెంబర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుల వేణు ప్రచారం రోజురోజుకీ ఊహించని స్థాయిలో దూసుకువెళుతుంది. రాజకీయ సమీకరణాల్ని తన వైపుకు తిప్పుకుంటూ, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపే విధంగా వేణు ప్రచారం పక్కా వ్యూహంతో సాగుతోంది. వాడ వాడలో కనిపిస్తున్న జనసందోహం, వేణు చుట్టూ ఏర్పడుతున్న మద్దతు వలయం ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా వేణు వైపుకు మార్చేస్తోంది. ప్రచారంలో వేణు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను స్వయంగా వింటూ, రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా ప్రజల్లో నుంచి వచ్చిన సేవాభావం ఉన్న మంచి వ్యక్తి అన్న భావనను కలిగిస్తున్నారు. “పదవి కోసం కాదు… బాధ్యత కోసం” అనే మాటతో ప్రచారంలో ప్రజలకు దగ్గరవుతున్న వేణు, ఎన్నికల రంగంలో తన ప్రత్యేక గుర్తింపును స్పష్టంగా చూపుతున్నారు.
‘మా వార్డుకు అభివృద్ధి తెచ్చేది వేణునే! అని రాజకీయ వర్గాల్లోనూ, స్థానికంగా ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది. 3వ వార్డ్‌లో ఈసారి గెలుపు పసుల వేణుదే. ప్రత్యర్థులతో పోలిస్తే.. ప్రజల్లో వేణు పై ఉన్న నమ్మకం అసాధారణంగా పెరిగింది. సమస్యలను విన్న తీరు, వెంటనే స్పందించే ధోరణి, గతంలో చేసిన సహాయాలు ఇవన్నీ వేణును ప్రజల హృదయాలకు మరింతగా దగ్గర చేశాయి. డ్రైనేజ్ సమస్యల పరిష్కారం, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల మరమ్మత్తులు, అలాగే కొత్త రోడ్ల నిర్మాణం, డ్రింకింగ్ వాటర్ లైన్ లకు శాశ్వత పరిష్కారం, మహిళల భద్రత కోసం స్ట్రీట్ లైట్ వ్యవస్థను బలోపేతం చేయడం.. యువత కోసం స్పోర్ట్స్ మెటీరియల్ & ట్రైనింగ్ సదుపాయాలు, వృద్ధులు, పేద కుటుంబాల కోసం సహాయక కేంద్రాలు.. తదితర హామీలను వేణు చెప్పడం కాదు.. నిజంగా అమలు చేస్తాడని ప్రజల నమ్మకంగా ఉన్నారు.
యువత వేణు వెనుక నిలబడ్డారు.. ప్రచారం చేస్తున్న ప్రతి గల్లీలో యువతే ముందుండి నినాదాలు చేస్తున్నారు. మా సమస్యలు చెప్పుకోగల నాయకుడు వేణునే అన్న భావన మహిళల్లో కూడా మరింత బలంగా కనిపిస్తోంది. ఎక్కడ ప్రచారం చేసినా ప్రజలు వేణుకు మద్దతు తెలియచేస్తున్నారు. ఈ స్పందనే ప్రస్తుతం మొత్తం వార్డ్‌లో రాజకీయ వాతావరణాన్ని ఒకే దిశలోకి మలిచింది. ఇది వరకు ఎన్నడూ కనిపించని స్థాయిలో పసుల వేణు పై ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రచారంలో కనిపిస్తున్న ఉత్సాహం.. ఈ ఎన్నికల్లో వేణు ముందంజలో ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజల తీర్పు ఎటు వైపు ఉండబోతుందో.. ప్రచారంలో స్పందన బట్టే స్పష్టంగా తెలుస్తుంది.

