MLA | అందుబాటులోకి తెస్తాం..

MLA | అందుబాటులోకి తెస్తాం..
- అసంపూర్తిగా షాదీఖానా భవనం
- మైనార్టీ పెద్దలతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాము
MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : ముస్లిం సోదరులకు భావోద్వేగంతో కూడుకున్న షాదీఖానా భవనాన్నినిర్మించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గుడివాడ ఎమ్మెల్యే (MLA) వెనిగండ్ల రాము అన్నారు. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మోడల్ షాదీఖానా భవన నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డులోని షాదీ ఖానాను ఈ రోజు మధ్యాహ్నం మైనార్టీ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మొక్కలతో నిండిన షాదీఖానా ప్రాంగణాన్ని చూసిన ఆయన, స్వయంగా జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు.
ఎమ్మెల్యే చొరవను చూసిన మైనార్టీ నాయకులు తామంతా ఐక్యంగా పనిచేస్తూ రెండు రోజుల్లో ప్రాంగణాన్ని శుభ్రం చేస్తామని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యానికి తావు లేకుండా జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని నాయకులకు ఎమ్మెల్యే రాము (Mla ramu) సూచించారు. ముందుగా షాదీఖానా భవనం అసంపూర్తిగా నిలిచిపోవడానికి గల కారణాలను జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో షాదీ ఖానా నిర్మాణ పనులకు ప్లాన్ మరియు అంచనాల రూపొందించాల్సిందిగా అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కొత్తగా నిధులు మంజూరు చేయించి, 7వేల చదరపు అడుగుల్లో, అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మైనార్టీ నేతలకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.. గుడివాడలో (Gudivada) ముస్లిం సోదరులందరికీ షాదీఖానా అంటే భావోద్వేగంతో కూడుకున్నదన్నారు. కూటమి ప్రభుత్వంలో 7వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సౌకర్యవంతంగా షాదీఖానాను మోడల్ భవనంగా నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దురదృష్టవశాత్తు గుడివాడలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారికి స్థానిక ఎన్నికలు జరిగినా ఇష్టం ఉండదని, అభివృద్ధి పనులు అడ్డుకునేందుకు కోర్టులకు వెళుతున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్దుల్ రబ్బాని, ఏఈ రాజేష్, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,గుడివాడ టిడిపి (TDP) అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎం.ఈ. ప్రసాద్,మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రహీం, షేక్ జానీ, సయ్యద్ జబిన్, రషీద్ బేగ్, ఇస్సాక్, రబ్బాని, మౌలాలి, రఫీ, ఇర్ఫాన్, ముజాహిద్, సర్కార్, అబ్దుల్ సత్తార్, మహమ్మద్ బేగ్, అబ్దుల్ ఆలీం, నూర్, మోబిన్, మోహిన్, రబ్బాని, చానా, సుభాని, అలీ, మల్లికా బేగం, ఆస్మా, నోరా, అజి మున్నీసా, లతిఫున్నిసా, టిడిపి నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, పండ్రాజు సాంబయ్య, గోకవరపు సునీల్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
