KTR | ఘనంగా తెలంగాణ విజయ్ దివస్

KTR | ఘనంగా తెలంగాణ విజయ్ దివస్

తెలంగాణ తల్లికి పాలాభిషేకం
రోగులకు పండ్లు బ్రెడ్డు పంపిణీ

KTR | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపుమేరకు మక్తల్ పట్టణంలోని 167వ జాతీయ రహదారి అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రులలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్ ప‌ర్సన్ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు. నాటి నుండి డిసెంబర్ 9న తెలంగాణ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ హ‌యాంలో అభివృద్ధి పథంలో నడిపించగా రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందన్నారు.

మళ్ళీ కేసీఆర్ రావాలని.. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని.. త్వరలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ (Market) కమిటీ చైర్మన్ పి.నరసింహ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, నాయకులు అన్వర్ హుస్సేన్, మొగులప్ప, జగ్గలి రాములు, మన్నాన్, కుమ్మరి రవి, శివారెడ్డి, చందాపూర్ అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply