Manigilla | కాంగ్రెస్ వలనే సాధ్యం..

Manigilla | కాంగ్రెస్ వలనే సాధ్యం..

Manigilla, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని మణిగిల్ల గ్రామాన్ని ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మన గ్రామ ప్రజలు, రైతులు మహిళలు, యువకులు ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ అభ్యర్థి చెవ్వ శివ యాదవ్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, కళ్యాణ్ లక్ష్మి, ప్రతి ఇంటికి ఉచిత కరెంటు బిల్లు.. అదే విధంగా గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను ప్రజలకు అందిస్తాను అన్నారు.

గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మన గ్రామం అభివృద్ధి సాధ్యమవుతుందని.. టీఆర్ఎస్ పార్టీ మాటలకు మోసపోవద్దు.. మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అండ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కొండ రవీందర్ రెడ్డి, వెంకటయ్య, బాలరాజు, మాజీ ఎంపీటీసీలు నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు మద్దిలేటి, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply