Godserial | అభివృద్ధి చేసి చూపిస్తా..

Godserial | అభివృద్ధి చేసి చూపిస్తా..
Godserial, దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ : ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని గోడిసిర్యాల సర్పంచ్ అభ్యర్థి మునేసుల రాజేష్ అన్నారు. 11 న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకూ సేవ చేయడమే లక్ష్యంగా సర్పంచ్ బరిలో ఉన్నానని ఒక్కసారి ఆలోచించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిస్కారం చేయడం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నానని తెలిపారు.
