WOMEN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని

WOMEN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని
WOMEN | జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ : త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ నుండి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని నియమించారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జె పి నడ్డాకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వణతి శ్రీనివాసన్ కి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు డాక్టర్ పద్మ వీరపనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకంతో తమిళనాడులో బీజేపీ బలోపేతానికి పద్మ వీరపనేని కీలక పాత్ర పోషించనున్నారు.
