తల్లి అనికూడా చూడకుండా…

కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కత్తితో ఓ వ్యక్తిని పొడుస్తుండగా అడ్డుకోబోయిన తల్లిని కూడా పొడిచి కలకలం సుష్ఠించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో ఈ రోజు సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన బూరుగండ్ల రవి(Burugandla Ravi) అదే గ్రామానికి పారునంది అర్జున్ లకు జరిగిన ఘర్షణలో కొట్టుకున్నారు.
ఈ క్రమంలో రవి చాకు తీసుకువచ్చి అర్జున్ ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన తల్లి సునీతను(mother Sunitha) కూడా చేయి దగ్గర పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తల్లి, కొడుకు ఇరువురు తప్పించుకుని నర్సింహులపేట పోలీస్ స్టేషన్(Police Station) కు ఫిర్యాదుకు వచ్చారు. స్థానిక ఎస్ఐ సురేష్ వెంటనే అంబులెన్స్(Ambulance) పిలిపించి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ చోటు చేసుకోవడానికి పాత కక్షలే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

