Summit | వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమే!
Summit | వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమే!
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Summit | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : వికసిత్ భారత్-2047లో తెలంగాణ (Telangana) రైజింగ్ కూడా ఓ భాగమే అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.అన్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కందుకూరు ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని తెలిపారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు.
అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్‌తో ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీనటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు: కైలాస్ సత్యార్థి
గాంధీ, నెహ్రూ మార్గంలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని ప్రముఖ బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ (Nobel) బహుమతి గ్రహిత కైలాష్ సత్యార్థి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక విజన్ దిశగా ముందుకు వెళ్తోందని ఈ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని చెప్పారు. ఈ రోజు ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడిన ఆయన నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని పాలసీలు తేవాలని తొలి ప్రధాని నెహ్రూకు గాంధీజీ దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేశారని విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని, మహిళలు ఉచితంగా బస్సుల్లో (Bus) ప్రయాణించే అవకాశం కల్పించారన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని, 2047 లోగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ మారుతుందన్నారు. సంస్కృతి, కళలు టెక్నాలజీ, పరిశ్రమల హబ్ గా తెలంగాణ అవతరించబోతున్నదని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అసాధ్యమని అన్నారని, కానీ సమస్యలకు ప్రతి భారతీయుడూ ఒక పరిష్కారం చూపిస్తాడని తాను చెప్పానన్నారు. ఐకమత్యం, శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మనం యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తామన్నారు.
