Candidate | అభివృద్ధే నా లక్ష్యం..

Candidate | సదాశివనగర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, గ్రామ అభివృద్ధిలో అసలైన మార్పు చూపించడానికి.. సదాశివనగర్ మండలంలోని వజ్జపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సోమిరి బాపురావు ఎన్నికలలో పోటీలో నిలిచారు. రిమోట్ గుర్తుకు ఓటు వేసి గ్రామ సర్పంచిగా గెలిపించాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించిన వెంటనే గ్రామ అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తానని మాటిస్తున్నారు. గ్రామంలో వెంటవెంటనే పారిశుద్ధ్యం నిర్వహణ కార్యక్రమం, గల్లి గల్లికి మురికి కాలువ నిర్మాణం, పశువులు వెళ్లడానికి పానాది రోడ్డు ఏర్పాటు, సీసీ రోడ్లు నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, విద్యుత్ సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం ప్రత్యేక కార్యక్రమాలు, త్రాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇస్తున్నారు.

Leave a Reply