BIKE | బుల్లెట్ బండి పై ప్రచారం

BIKE | బుల్లెట్ బండి పై ప్రచారం
BIKE | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామానికి చెందిన కూర వెంకటరాజిరెడ్డి గెలుపు దాదాపు ఖాయమైనట్లు గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ప్రచారంలో ఆయన రాకెట్ లా దూసుకు వెళ్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటెయ్యండి.. బాధ్యతాయుతమైన పాలన అందిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. కూర వెంకటరాజిరెడ్డి వైపే గ్రామస్తులు మొగ్గు చూపడం విశేషం. ప్రజలంతా కలిసికట్టుగా ఆయన తరుపున గ్రామంలో ద్విచక్ర వాహనలపై ప్రచారం చేయడం మరో విశేషం. గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తానని ఆయన తెలిపారు.
అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు. గ్రామంలో ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనిలో ముందుండి పని చేశానని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. మా ఓటు కూర వెంకట రాజిరెడ్డికి అని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ప్రచారానికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు.
