Tangutoor | ఆదర్శ గ్రామంగా నిలబెడతా..

Tangutoor | ఆదర్శ గ్రామంగా నిలబెడతా..

Tangutoor, శంకర్ పల్లి, ఆంధ్రప్రభ : శంకర్ పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టంగుటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బద్దం హరిత కృష్ణారెడ్డి వినూత్నంగా తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధులను కలుస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వారిని ఉంగరం గుర్తు పై ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా వార్డులలో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత ఆరు సంవత్సరాల నుండి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టసుఖాలలో భాగమై కొనసాగుతున్న బద్దం హరిత కృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు.

ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తూ ఉండడంతో మరింత ఉత్సాహంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టంగుటూరు గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి విషయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో ప్రభుత్వ నిధులను తీసుకువచ్చి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా నిలబెడతామని బద్దం హరి త కృష్ణారెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నారు.

Leave a Reply